Eluru: జాతీయ రహదారుల భూసేకరణ పనులు వేగవంతం చేయాలి.. కలెక్టర్!
Eluru: ఖరగపూర్-విజయవాడ జాతీయ రహదారి భూసేకరణ, ఆర్వోబీ పనులు, పోలవరం నిర్వాసితుల పరిహారం తక్షణమే పూర్తి చేయాలని ఏలూరు కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
Eluru: జాతీయ రహదారుల భూసేకరణ పనులు వేగవంతం చేయాలి.. కలెక్టర్!
Eluru: ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి శనివారం జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఖరగపూర్ - విజయవాడ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ చర్యలను వెంటనే చేపట్టాలి అని జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఇతర జాతీయ రహదారుల భూసేకరణ మరియు ఆర్.ఓ.బి (ROB) నిర్మాణ పనులను వేగవంతం చేయాలి అని పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ (R&R) కాలనీల పనులను సమీక్షించి,నిర్వాసితులకు రావాల్సిన పరిహారాలను తక్షణమే అందించాలి అని అన్నారు.
ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ,నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న,ఆర్డీఓలు మరియు జాతీయ రహదారి శాఖ అధికారులు పాల్గొన్నారు.




