Eluru: సురవరం సేవలు యువతకు స్ఫూర్తిదాయకం ఏలూరు జిల్లా సీపీఐ నాయకులు!

Eluru: ఏలూరు జిల్లా కుక్కునూరులో సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి. ఆయన సేవలను కొనియాడిన నాయకులు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 23 Aug 2026 8:00 AM IST
Eluru
X

Eluru: సురవరం సేవలు యువతకు స్ఫూర్తిదాయకం ఏలూరు జిల్లా సీపీఐ నాయకులు!

Eluru: సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యుడు సురవరం. సుధాకర్ రెడ్డి సేవలు ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పోలవరం నియోజకవర్గ కార్యదర్శి కారం. దారయ్య, కుక్కునూరు మండల కార్యదర్శి కొన్నె లక్ష్మయ్య కొనియాడారు. స్థానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో శనివారం సురవరం ప్రథమ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తండ్రి సురవరం. వెంకటరామిరెడ్డి పోరాట పటిమ ని అందిపుచ్చుకుని విద్యార్థి దశలోనే వామపక్ష ఉద్యమాలకు ఆకర్షితులై మన దేశ వామపక్ష ఉద్యమంలో కీలక భాద్యతలు నిర్వహించారని గుర్తుచేశారు.కాగా పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సురవరం. సుధాకర్ రెడ్డిని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా అధ్యక్షురాలు వరకా శ్యామల, వేలేరుపాడు మండల కార్యదర్శి బాడిస.రాము,కురాకుల బాబురావు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story