Kukunoor: నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి సీపీఐ డిమాండ్

Kukunoor: సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో నిరసన సభ జరిగింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని కార్యదర్శి ఎస్కే గౌస్ డిమాండ్ చేశారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 18 July 2026 6:54 PM IST
Kukunoor
X

Kukunoor: నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి సీపీఐ డిమాండ్

కుకునూర్: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గుండుగూడెం గ్రామంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ కార్యకర్తల సమావేశం కంగాల కన్నయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఏలూరు జిల్లా కమిటీ కార్యదర్శి ఎస్కే గౌస్ మాట్లాడుతూ, నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ పై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ గత 19 రోజులుగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష లో పాల్గొన్న సామాజికవేత్త, పర్యావరణవేత్త,మేధావి సోనం వాంగ్ చుక్ చేస్తున్న ఉద్యమానికి, జూలై 20న కాక్రోచ్ పార్టీ చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని బలపరుస్తూ,

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ దేశవ్యాప్తంగా వివిధ రూపాలలో కార్యక్రమాలు జరపాలనే పిలుపులో భాగంగా గుండు గూడెం లో 60 మందితో నిరసన సభ జరిగింది. 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ ప్రశ్నాపత్రం లీక్ పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడి ఉద్యమకారులతో మేధావులతో చర్చ జరపాలని అన్నారు. 1984లో లడక్ కు "షెడ్యూల్ తెగ" ఎస్ టి హోదా కల్పించాలని సోనం వాంగ్చుక్ తండ్రి సోనం వాంగ్వాల్.. నిరాహార దీక్ష చేశారు.

అప్పటి ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ స్వయంగా లేహో లో వెళ్లి హామీ ఇచ్చి దీక్ష విరమింప చేశారు. వాంగ్ చుక్ మరణానికి దగ్గర అయినప్పటికీ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం సమాజం అంతా అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు సిరికొండ రామారావు, గడ్డాల ముత్యాలరావు, మండల నాయకులు నారం మునయ్య, కామయ్య, కృష్ణ,ఆదయ్య ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story