Velairpadu: పెద్ద వాగు ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇవ్వాలని డిమాండ్!
Velairpadu: వేలేరుపాడు తహసీల్దార్ ఆఫీస్ వద్ద పెద్ద వాగు ప్రాజెక్టు కరకట్ట పునర్నిర్మాణం కోసం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో రైతులు భారీ ధర్నా చేశారు.
Velairpadu: పెద్ద వాగు ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇవ్వాలని డిమాండ్!
వేలేర్పడు: సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ వేలేరుపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో వేలేరుపాడు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద పెద్ద వాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు, పోలవరం నిర్వాసితులతో ధర్నా నిర్వహించారు. కట్టం ముత్యాలరావు అధ్యక్షత వహించిన ఈ సభలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఏలూరు జిల్లా కమిటీ కార్యదర్శి ఎస్కే.గౌస్ మాట్లాడుతూ.. 2024 జులై 18న కురిసిన భారీ వర్షాలకు పెద్ద వాగు ప్రాజెక్టు కరకట్ట గండిపడి రెండు సంవత్సరాలు పూర్తయింది.
కరకట్ట తెగిన నాటినుండి ఈనాటి వరకు పునః నిర్మాణం చేయకుండా ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు వంతులు వేసుకుంటూ సాచివేత ధోరణి నీ కొనసాగిస్తున్నాయి. ఈ రెండు సంవత్సరాల కాలంలో భూములకు సాగునీరు అందక వేసిన పంటలు ఎండిపోయి పెట్టిన పెట్టుబడులు రాక ప్రాజెక్టు ఆయకట్టులో ఉన్న సన్న చిన్న కారు వేలాది మంది రైతు కుటుంబాలు అప్పులలో మునిగి కడుపునిండా తిండి దొరకక, అర్ధాకలితో జావా గంజి నీళ్లతో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ కుటుంబాల పిల్లలు ఆర్థిక ఇబ్బందుల వలన పై చదువులు మధ్యలో మానేసి కూలి పనులకు వెళుతున్నారు. ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడం వలన వాగులు ఎండిపోయి మంచినీరు, పశువులకు నీరు దొరకని దుస్థితి నెలకొంది.
హైదరాబాదులో జూలై 28న జరగనున్న జి ఆర్ ఎం బి సమావేశంలో చర్చించి కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ప్రాజెక్టు పునర్నిర్మాణ సాంకేతిక మంజూరి ఇవ్వవలసిందిగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు సిరికొండ రామారావు, గడ్డాల ముత్యాలరావు, కట్టం వీరస్వామి, పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి ఎస్ కే మున్ని,మేడేపల్లి మాజీ సర్పంచ్ కట్టం రాంబాబు, నార్లవరం మాజీ ఎంపీటీసీ కట్టం రత్తమ్మ, తిరుమలాపురం సర్పంచ్, ఉప సర్పంచ్ సోడే విజయ, వి. బుచ్చయ్య, నాయకులు ఆసి లక్ష్మయ్య,మడకం నాగేశ్వరావు, రామారావు ధర్మయ్య, సూరయ్య తదితరులు పాల్గొన్నారు.




