Kukunoor: ఆధార్ అవస్థలపై ఎమ్మార్వోకు సీపీఐ వినతిపత్రం
Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Kukunoor: ఆధార్ అవస్థలపై ఎమ్మార్వోకు సీపీఐ వినతిపత్రం
Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ప్రజలు, రైతులు ,విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారని తక్షణమే ఆధార్
కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఐ కుక్కునూరు మండల కమిటీ స్థానిక ఎమ్మార్వో చలపతిరావుకి వినతిపత్రం అందజేశారు. అనంతరం మండల కార్యదర్శి కొన్నె.లక్ష్మయ్య మాట్లాడుతూ విద్యార్థుల ఆధార్, పాఠశాల రికార్డుల్లో, జనన ధృవీకరణ పత్రాల్లో ఇంటి పేర్లు, పేర్లు,చిరునామా ఒకేలా కచ్చితంగా సరిచేసేందుకు ఆధార్ కేంద్రం లేకపోవడంతో తల్లికి వందనం పథకం వర్తింపుపై పలు అనుమానాలు నెలకొని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
కాగా మారుమూల ఏజెన్సీ కావడంతో వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు అవసరమైన ఎరువులు తీసుకోవాలన్నా మొబైల్ నెంబరు , ఆధార్ కార్డుకు అనుసంధానం లేక సుమారు రూ ఐదారు వందల ప్రయాణం ఖర్చుతో భద్రాచలం, అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం, సత్తుపల్లి వంటి ప్రాంతాలకు వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందనిన్నారు. అధికారులు స్పందించి తక్షణమే ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయిన కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో సహాయ కార్యదర్శి కురాకుల. బాబూరావు పాల్గొన్నారు.




