Eluru: రేషన్ మాఫియాపై ఉక్కుపాదం.. అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్!

Eluru: ఏలూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని, బియ్యం అమ్మితే కార్డులు రద్దు చేస్తామని డీఎస్‌ఓ బాబు విలియమ్స్ హెచ్చరించారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 16 Nov 2026 9:48 PM IST
Eluru
X

Eluru: రేషన్ మాఫియాపై ఉక్కుపాదం.. అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్!

ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా పౌర సరఫరాల అధికారి బాబు విలియమ్స్ తెలిపారు.సోమవారం ఏలూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

కొయ్యలగూడెం మండలం రాజవరం,కన్నాపురం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించగా, రేషన్ దుకాణాల్లో బియ్యం నిల్వల్లో ఎలాంటి వ్యత్యాసాలు కనిపించలేదన్నారు. రేషన్ బియ్యాన్ని ఇతరులకు విక్రయిస్తే సంబంధిత కార్డులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

ప్రస్తుతం జిల్లాలో 9 ధరణి కేంద్రాల ద్వారా బీపీటీ సన్నబియ్యాన్ని రాయితీపై అందిస్తున్నామని,త్వరలో ప్రతి మండల కేంద్రంలోనూ ధరణి కేంద్రాలు ఏర్పాటు చేసి నాణ్యమైన సన్నబియ్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid