Eluru: అర్నాబ్ తుఫాన్ అలర్ట్ బడులకు 27, 28 తేదీల్లో సెలవులు!
Eluru: అర్నాబ్ తుఫాన్ దృష్ట్యా ఏలూరు జిల్లాలో హైఅలర్ట్. అక్టోబర్ 27, 28 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన కలెక్టర్ వెట్రిసెల్వి. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే.
Eluru: అర్నాబ్ తుఫాన్ అలర్ట్ బడులకు 27, 28 తేదీల్లో సెలవులు!
ఏలూరు: అర్నాబ్ తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఏలూరు జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు.సోమవారం స్థానిక కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడతో కలిసి తుఫాన్ తీవ్రత, నష్ట నివారణ చర్యల పై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
ఈనెల 27వ తేదీ (మంగళవారం) సాయంత్రం నుండి జిల్లాలో 125 కి.మీ వేగంతో పెనుగాలులు,భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని కలెక్టర్ తెలిపారు.తుఫాన్ తీవ్రత దృష్ట్యా జిల్లాలోని పాఠశాలలు,కళాశాలలు,అంగన్వాడీ కేంద్రాలకు ఈనెల 27,28 తేదీల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
సమీక్షలో కలెక్టర్ జారీ చేసిన ముఖ్య ఆదేశాలు,ముందస్తు చర్యలో భాగంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు,గర్భిణీలు, బాలింతలు,వృద్ధులు మరియు దివ్యాంగులను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అని పెనుగాలుల వల్ల కూలిపోయే ప్రమాదం ఉన్న శిథిల భవనాలు,రేకుల షెడ్ల యజమానులను అప్రమత్తం చేయాలి అని రహదారులపై చెట్లు కూలిపోతే వెంటనే తొలగించేందుకు క్రేన్లు,బుల్డోజర్లను సిద్ధంగా ఉంచాలి అని విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా,లైన్లు దెబ్బతింటే వెంటనే పునరుద్ధరించేందుకు మండల స్థాయిలో సిబ్బందిని,పరికరాలను అందుబాటులో ఉంచాలి అని సూచించారు.
వర్షాల సమయంలో ప్రజలు కల్వర్టులు,కాజ్‌వేలు దాటకుండా బారికేడ్లు,హెచ్చరిక బోర్డులతో పాటు సిబ్బందిని కాపలా ఉంచాలి అని రైతులు పంట నష్టపోకుండా వ్యవసాయ శాఖ అవగాహన కల్పించాలి అని జిల్లా అధికారులు ఈనెల 29వ తేదీ వరకు తమ ప్రధాన కేంద్రాల్లోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలి అని అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
కలెక్టరేట్ అత్యవసర కంట్రోల్ రూమ్ నంబర్లు:
తుఫాన్ సహాయక చర్యలు, సమస్యల నివేదన కోసం ఏలూరు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.
ప్రజలు,అధికారులు క్రింది నంబర్లను సంప్రదించవచ్చు:
* 18002331077 (టోల్ ఫ్రీ)
* 08812-224519
* 9491041419
ఈ సమీక్షా సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి,జెడ్పీ సీఈఓ ఎం.కృష్ణమోహన్,డీపీఓ మల్లికార్జునరావుతో పాటు పంచాయతీరాజ్,ఆర్ అండ్ బి,ట్రాన్స్‌కో ఎస్ఈలు,వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




