Chintalapudi: యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్సైకి వినతి!
Chintalapudi: చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌పై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్న యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్సైకి దళిత నేతలు ఫిర్యాదు చేశారు.
Chintalapudi: యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్సైకి వినతి!
Chintalapudi: ఏలూరు జిల్లా చింతలపూడి గౌరవ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ గారిపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తూ, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న బి.ఆర్.కె (BRK) యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆదివారం చింతలపూడి మండల ఎస్సై గారిని కలిసి చింతలపూడి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్ము తిరుపతిరావు (KTR - ప్రగడవరం), నాయకులు పిల్లజుట్టు రాజేష్, పర్స శ్రీకాంత్, మరియు సింగపాము సురేష్ తదితరులు ఈ మేరకు లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్ము తిరుపతిరావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ గారు అనునిత్యం ప్రజల మధ్యే ఉంటూ, ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరిస్తున్నారని కొనియాడారు. చింతలపూడి నియోజకవర్గాన్ని ఒక పక్కా ప్రణాళికతో 'బంగారు చింతలపూడి'గా అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే గారు నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
ఇలాంటి ప్రజాదరణ కలిగిన ఒక దళిత ఎమ్మెల్యేపై కావాలనే బురదజల్లేలా, ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత పెంచేలా సదరు యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ సత్య అసత్య కథనాలను ప్రసారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులను ప్రలోభాలకు గురిచేసి, వారి ద్వారా ఎమ్మెల్యే గారి ప్రతిష్టను దెబ్బతీసేలా వార్తలు వేస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఒక దళిత శాసనసభ్యుడిపై జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, పాత్రికేయ విలువలని వదిలేసి వ్యక్తిగత స్వార్థం కోసం బురదజల్లుతున్న సదరు విలేకరిపై వెంటనే విచారణ జరిపి, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.




