Chintoor: చింతూరులో దళితుల స్మశాన సమస్యపై ఐటీడీఏ పీవో హామీ!
Chintoor: చింతూరులో దళితులకు స్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలని కోరుతూ అంబేద్కర్ దళిత సంఘ నేతలు ఐటీడీఏ పీవో శుభం నొక్వాల్‌కు వినతిపత్రం అందజేశారు.
Chintoor: చింతూరులో దళితుల స్మశాన సమస్యపై ఐటీడీఏ పీవో హామీ!
చింతూరు: మండల కేంద్రం చింతూరులో దళితులకు స్మశాన వాటిక కేటాయించాలని చింతూరు బి ఆర్ అంబేద్కర్ దళిత సంఘ నాయకులు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శుభం నొక్వాల్ కు వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా దళిత నాయకులు గతంలో తమ సభ్యులు ఎవరైనా చనిపొతే శబరి నది ఒడ్డున పూడ్చి పెట్టేవారమని ఆ స్థలం నీటి ప్రవాహ వేగానికి కోతకు గురైందని, ప్రస్తుతం స్మశాన వాటిక లేనందున తమ సంఘానికి స్థలం లేకుండా పోయిందని పీఓ కి మొరపెట్టుకున్నారు.
పది రోజులలో స్థలం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని ప్రాజెక్ట్ అధికారి హామీ ఇచ్చినట్లు దళిత సంఘం నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు మెల్లెం నాగేంద్ర కుమార్ , ప్రధాన కార్యదర్శి ఇంటి సుదర్శన్ కుమార్, నాయకులు నక్క రజనీ కుమార్, ప్రసంగి తదితరులు పాల్గొన్నారు.




