Eluru: డీలిమిటేషన్ షరతులు లేకుండా 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి
Eluru: 33 శాతం మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కుక్కునూరులో చేపట్టిన సంతకాల సేకరణ పూర్తి వివరాలు.
Eluru: డీలిమిటేషన్ షరతులు లేకుండా 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి
ఏలూరు: కుక్కునూరు మండలంలో ఏపీ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ. యామిని,జిల్లా అధ్యక్షురాలు వరకా. శ్యామల అధ్యర్యంలో శుక్రవారం కుక్కునూరు మండల కేంద్ర ప్రధాన సెంటర్ లో డీ లిమిటెషన్ షరతులు లేని మహిళా బిల్లు కోసం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్లమెంటులో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ బిల్లును జనగణన, డీ లిమిటెషన్ తో ముడిపెట్టడం మహిళలను మోసం చేయడమేనని విమర్శలు చేశారు.
రాజకీయ లబ్ధి కోసం కాలయాపన చేయకుండా 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, లేని పక్షాన దేశ వ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే డీ లిమిటెషన్ కు ప్రభుత్వం మద్దతు తెలపడం సరికాదన్నారు.
సమావేశంలో సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ. కృష్ణ చైతన్య, కుక్కునూరు కార్యదర్శి కొన్నె. లక్ష్మయ్య, కురాకుల. బాబూరావు, సోడే. నాగేష్, వరసా. పాపారావు, సోడే. మారయ్య, మడకం. భీమయ్య, కొన్నె. జయశ్రీ,వరసా. లక్ష్మీ, కంగాల. లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.




