Denduluru: ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతమనేని

Denduluru: దెందులూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరిగింది. తొలిరోజే 93.21 శాతం పంపిణీ పూర్తి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 Oct 2026 8:34 PM IST
Denduluru
X

Denduluru: ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతమనేని

దెందులూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసాపించను పధకము ఫించన్లు పంపిణీ ప్రభుత్వ ఆదేశంల ప్రకారం 1వ తేదీన ఉదయం 6:30AM నుండి పంపిణీ చేశారు. దెందులూరు నియోజకవర్గం స్తాయిలో దెందులూరు నందు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ నియోజక వర్గములో మంజూరు అయిన (25) స్పౌస్ పించనల పంపిణి చేశారు.

దెందులూరు ఎం‌పి‌డి‌ఓ కార్యాలయములో జరిగిన పించను పంపిణి కార్యక్రమములో జిల్లా ట్రైని కల్లెక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి ,డిఆర్డిఏ పీడీ టి వి.విజయలక్ష్మి,ఏలూరు వారు మరియు ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.అక్టోబర్ నెలలో 2,53,360 మంది ఫించన్ దారులకు ఫించన్ పంపిణీ చేయవలసి ఉండగా గురువారం ఉదయం 6:30 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు 2,36,168 ఫించన్లు పంపిణీ చేయడం ద్వారా 93.21 శాతం ఫించన్లు పంపిణీ పూర్తి చేసామన్నారు.

605 సచివాలయాల పరిధి లోని 4925 మంది సిబ్బంది ప్రతి ఇంటి కి వెళ్ళి అవ్వా,తాత లకు ఫించన్ చెల్లించి ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చారు.

ఈ రోజు పంపిణీ చేయగా మిగిలిన లబ్ది దారులకు మరియు వివిధ ఆరోగ్య సమస్యలతో ఇతర ప్రాంతాలలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న లబ్దిదారులకు మానవతా దృక్పదము తో ఫించన్ లు అందించుటకు చర్యలు తీసుకొనవలెనని అలాగే ఫించన్ పొందని అందరి లబ్దిదారులకు సిబ్బంది స్వయంగా ఫోన్ చేసి 3వతేదీ సాయంత్రం లోగా 100 శాతం పంపిణీ పూర్తి చేయవలసినది గా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్