Denduluru: డ్రోన్లతో నిఘా.. 100 మీటర్ల ఆంక్షలు: ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్!

Denduluru: దెందులూరు ఎంపీడీవో కార్యాలయంలోని ఎంపీటీసీ నామినేషన్ల కేంద్రాన్ని ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Oct 2026 11:18 PM IST
Denduluru
X

Denduluru: డ్రోన్లతో నిఘా.. 100 మీటర్ల ఆంక్షలు: ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్!

దెందులూరు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లా దెందులూరు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం (MPDO) వద్ద ఏర్పాటు చేసిన ఎంపీటీసీ నామినేషన్ల కేంద్రాన్ని జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ,భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఆయన,విధుల్లోని పోలీసు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిని కఠినంగా అమలు చేయాలి అని అనుమతి లేని వ్యక్తులు,వాహనాలను లోపలికి రానివ్వకూడదు అని తెలిపారు.నిబంధనల ప్రకారం అభ్యర్థితో పాటు నిర్దేశిత సంఖ్యలోని వ్యక్తులను మాత్రమే కేంద్రంలోకి అనుమతించాలి అని సమస్యాత్మక,కీలక ప్రాంతాలలో డ్రోన్ల సహాయంతో నిరంతరం నిఘా ఉంచి,అనుమానాస్పద కదలికలను పర్యవేక్షించాలి అని సున్నిత ప్రాంతాలుగా గుర్తించిన చోట్ల ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించి,

పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలి అని ఎన్నికల నియమావళికి లోబడి,ఎన్నికల అధికారులు మరియు ఇతర శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేయాలి అని ఎన్నికల ప్రక్రియ మొత్తం అత్యంత పారదర్శకంగా,నిష్పక్షపాతంగా,ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.అభ్యర్థులు,రాజకీయ పార్టీలు,ప్రజలు పోలీసు యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్