Nuzvid: నూజివీడు కోట అమ్మవారి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు!
Nuzvid: ఏలూరు జిల్లా నూజివీడులో శ్రీ కోట మహిషాసుర మర్దిని అమ్మవారు రెండవ రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాలకు రూ. 10 లక్షలు కేటాయించారు.
Nuzvid: నూజివీడు కోట అమ్మవారి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు!
Nuzvid: దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నూజివీడు పట్టణంలో 70వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా పట్టణ నడిబొడ్డులో వేంచేసి ఉన్న శ్రీ కోట మహిషాసుర మద్దిని అమ్మవారు నేడు రెండవ రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
నేడు తెల్లవారుజాము నుండి భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఏదైనా కోరిక కోరితే తప్పకుండా అమ్మవారు తీరుస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.ఈ ఆలయం 12వ శతాబ్దం నాటిది,నాడు జమీందారీ కాలంలో ఎవరైనా శత్రువు రాజులు దండయాత్రకు వస్తే అమ్మవారు జమీందారులకు సాంకేతాలు పంపేదని చరిత్ర చెబుతుంది.
రాష్ట్ర నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కోలుసు పార్థసారథి మాట్లాడుతూ దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసామని ఎంతో ప్రసిద్ధిగాంచిన నూజివీడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడి విజయవాడ ఇంద్రకీలాద్రి నుండి నూజివీడు శ్రీ కోట మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయానికి 10 లక్షల రూపాయలు దసరా ఉత్సవాల నిర్వహణకు ఫండ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.




