Nuzvid: నూజివీడు కోట మహిషాసుర మర్దిని ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు!
Nuzvid: ఏలూరు జిల్లా నూజివీడులోని శ్రీ కోట మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయంలో 70వ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.
Nuzvid: నూజివీడు కోట మహిషాసుర మర్దిని ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు!
Nuzvid: ఏలూరు జిల్లా నూజివీడు పట్టణ నడిబొడ్డున వేంచేసి ఉన్న శ్రీ కోట మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయంలో 70వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి.దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు ఎనిమిదవ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు అద్భుత దర్శనమిస్తున్నారు.
నేడు తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయానికి భారీగా పోటెత్తారు.అమ్మవారిని దర్శించుకుని,ప్రత్యేక పూజలు,అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు.భక్తుల జయజయధ్వానాలు, వేద మంత్రోచ్ఛారణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి.ఈ ఆలయం12వ శతాబ్దం నాటి చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ఆలయంలోని అమ్మవారు అత్యంత శక్తిస్వరూపిణిగా పూజలందుకుంటున్నారు.
పూర్వ కాలంలో ఎవరైనా శత్రు రాజులు ఈ ప్రాంతంపై దండయాత్రకు వస్తే, అమ్మవారు ఇక్కడి జమీందారులకు ముందుగానే రక్షణ సంకేతాలు పంపేవారని,తద్వారా రాజ్యం సురక్షితంగా ఉండేదని భక్తుల ప్రగాఢ నమ్మకం.నాటి నుండి నేటి వరకు భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు నూజివీడు ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారు.
నవరాత్రుల్లో ఎనిమిదవ రోజైన దుర్గాష్టమి నాడు అమ్మవారిని దుర్గాదేవిగా పూజించడం వల్ల సకల అరిష్టాలు,శత్రు పీడలు తొలగిపోతాయని పండితులు పేర్కొంటున్నారు.దుర్గాదేవి రూపంలో ఉన్న అమ్మవారికి ఈరోజు విశేషంగా "కదంబం" (లేదా శాకాన్నం) మరియు "గారెలు" నైవేద్యంగా సమర్పిస్తారు.ఈ మహోత్సవాల నేపథ్యంలో ఆలయ అధికారులు,కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల క్యూ లైన్లు,తాగునీరు మరియు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.




