Chintoor: ఏకలవ్య పాఠశాల విద్యార్థిని ఫినాయిల్ తాగి సూసైడ్ యత్నం!
Chintoor: చింతూరు మండలం లక్కవరం ఏకలవ్య పాఠశాల విద్యార్థిని ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం. భద్రాచలం ఆస్పత్రికి తరలింపు, పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
Chintoor: ఏకలవ్య పాఠశాల విద్యార్థిని ఫినాయిల్ తాగి సూసైడ్ యత్నం!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు మండలం లక్కవరం గ్రామంలోని ఏకలవ్య పాఠశాల విద్యార్థిని గురువారం ఫినాయిల్ తాగింది. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తుంది.ఈ వార్త ఆలస్యంగా శుక్రవారం వెలుగు చూసింది. తెలిసిన వివరాలు ప్రకారం ఏకలవ్య పాఠశాలలో బైపిసి మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని గురువారం పాఠశాలలో ఫినాయిల్ తాగింది.
ఇది గమనించిన పాఠశాల సిబ్బంది విద్యార్థిని ను హుటా హుటిన తులసిపాక లోని ప్రాథమిక వైద్య కేంద్రానికి తీసుకుని వెళ్లారు. అక్కడ వైద్యం అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం చింతూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు రిఫర్ చేశారు. వైద్యం అందించిన చింతూరు వైద్యులు విద్యార్థినికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తుంది. విద్యార్థిని ఫినాయిల్ ఎందుకు తాగిందో ఉన్నతాధికారుల విచారణలో తెలియనుంది.




