Eluru: ఏలూరు జిల్లాలో నేడు జెడ్పీటీసీ, ఎంపీటీసి ఎన్నికల పోలింగ్

Eluru: ఏలూరు జిల్లాలో 27 జెడ్పీటీసీ, 454 ఎంపీటీసీ స్థానాలకు నేడు పోలింగ్. 12.96 లక్షల మంది ఓటర్లు. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ కె.వెట్రిసెల్వి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Nov 2026 11:19 PM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లాలో నేడు జెడ్పీటీసీ, ఎంపీటీసి ఎన్నికల పోలింగ్

ఏలూరు: ఏలూరు జిల్లాలోని జెడ్పిటీసి,ఎంపిటిసి స్థానాలకు ఈనెల 5వ తేదీన జరగనున్న ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు పటిష్టమైన ను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.ఉంగుటూరు ఎంపిడిఓ కార్యాలయంలో బుధవారం పోలింగ్ సిబ్బందికి ఏర్పాటుచేసిన పోలింగ్ పరికరాల పంపిణీ కేంద్రంలో పోలింగ్ పరికరాల పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. అక్కడ సిబ్బందిని పలు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 27 జెడ్పిటిసి లు, 454 ఎంపిటిసి స్థానాలకు ఈనెల 5వ తేదీన పోలింగ్, 7వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.జిల్లాలో జెడ్పిటీసి,ఎంపిటిసి ఎన్నికలలో 12 లక్షల 96 వేల 515 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారన్నారు.పోలింగ్ నిర్వహణ కోసం 1555 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుచేయడం జరిగిందని,2444 బ్యాలెట్ బాక్సులు వినియోగించడం జరుగుతుందన్నారు.

సమస్యాత్మక,అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో అదనపు భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు.ఒకొక్క పోలింగ్ స్టేషన్ లలో ప్రిసైడింగ్ అధికారి,సదరు పోలింగ్ స్టేషన్లో ఓటర్ల సంఖ్యను అనుసరించి ఒకరి నుండి ముగ్గురు వరకు పోలింగ్ సిబ్బంది ఉంటారన్నారు.వీరికి 2సార్లు పోలింగ్ ప్రక్రియపై 2సార్లు శిక్షణ అందించడం జరిగిందని,పోలింగ్ పరికరాలతోపాటు,వాహనాలలో పోలింగ్ స్టేషన్ కి పంపడం జరుగుతుందన్నారు.

బస్సులో రూట్ అధికారిని కూడా పంపడం జరుగుతుందన్నారు.నవంబర్,5వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని,ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రాన్ని పోలింగ్ నిమిత్తం సిద్ధం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల ప్రత్యేక అధికారి రామ్మోహన్,తహసీల్దార్ సన్యాసిరావు,ఎంపిడిఓ రాజ్ మనోజ్,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్