Eluru: తుపాను ప్రభావం – 1,900 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు!
Eluru: ఏలూరు జిల్లాలో తుపాను ముంపు ప్రాంతాల నుంచి 1,900 మంది ప్రజల తరలింపు. 50 పునరావాస కేంద్రాల్లో వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడి.
Eluru: తుపాను ప్రభావం – 1,900 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు!
ఏలూరు: ఏలూరు జిల్లాలో తుఫాన్ తీవ్రత దృష్ట్యా లోతట్టు ప్రాంతాలలోని 1900 మంది ప్రజలను 50 పునరావాస కేంద్రాలకు తరలించామని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.పునరావాస కేంద్రాల్లోని ప్రజలకు భోజన,వసతి సదుపాయాలు అందించడం జరుగుతుందని,తుఫాన్ సాధారణ పరిస్థితికి వచ్చే వరకు వారికి భోజన,వసతి సౌకర్యాలు అందిస్తామన్నారు.
జిల్లాలో ఇంతవరకు 852 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనన్నారు.ప్రాధమిక సమాచారాల ప్రకారం జిల్లాలో 17 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని,3 పాడిపశువుల మరణించాయన్నారు.తీవ్రమైన పెనుగాలులకు 418 చెట్లు కూలిపోయాయని, 120 విద్యుత్ స్తంబాలు వాటిని తొలగించి రవాణా,విద్యుత్ సరఫరాలను పునరుద్ధరించడం జరిగిందన్నారు.
పెనుగాలులకు విద్యుత్ వైర్లు తెగిపోవడం,వంటి పలు కారణాలతో విద్యుత్ సరఫరాల నిలిపివేసిన ప్రాంతాలలో,వాటికి మరమ్మత్తులు నిర్వహించామన్నారు.
18 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు.గురువారం సాయంత్రానికి సాధారణ పరిస్థితికి వస్తుందని,అప్పటివరకు అధికారులు సహాయ,పునరావాస కార్యక్రమాలు పాల్గొనాలన్నారు.భారీ వర్షాల కారణంగా కల్వర్టులు,కాజ్ వే లను వద్ద ప్రజలు దాటకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు.




