Eluru: ఏలూరులో 5,700 ఎకరాలు 22ఏ నుండి తొలగింపు

Eluru: ఏలూరు జిల్లాలో 22ఏ జాబితా నుంచి 5,700 ఎకరాల భూమి తొలగింపు. 5,937 మంది రైతులకు లబ్ధి చేకూర్చినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Oct 2026 10:43 PM IST
Eluru
X

Eluru: ఏలూరులో 5,700 ఎకరాలు 22ఏ నుండి తొలగింపు

ఏలూరు: ఏలూరు జిల్లాలో 5700 ఎకరాల భూమిని 22ఏ జాబితా నుండి తొలగించి 5937 మంది రైతులకు లబ్ది చేశామని రాష్ట్ర పౌర సరఫరాలు శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశపు హాలులో గురువారం జిల్లా సమీక్షా సమావేశం అనంతరం 22ఏ జాబితా నుండి భూములను తొలగించిన రైతులకు ఉత్తరువులను మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ 22ఏ జాబితా నుండి జిరాయితీదారుల భూముల తొలగింపునకు రాష్ట్రంలోనే ఏలూరు జిల్లా ఆదర్శంగా నిలిచిందన్నారు.ఏలూరు జిల్లాలో తీసుకున్న చర్యలను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలోనూ ముఖ్యమంత్రి అమలు చేసారన్నారు.ఏలూరు జిల్లాలో పలుమార్లు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఇంతవరకు 5700 ఎకరాల భూమిని 22ఏ జాబితా నుండి తొలగించి,5937 మంది రైతులకు లబ్ది కలిగిందన్నారు.

దశాబ్దాలుగా పరిష్కారం కానీ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ కారణంగా తమ భూ సమస్యలకు విముక్తి కలిగిందని ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు.జిల్లాలో 22ఏ భూ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ బి.వినూత్న,ఆర్డీఓలు లక్ష్మి ప్రసన్న,రమణ లను, రెవిన్యూ అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి,రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్, జయమంగళ వెంకటరమణ, శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, డా.కామినేని శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇంచార్జ్ డిఆర్ఓ ఎం. ముక్కంటి, ఆర్డీఓ లు లక్ష్మిప్రసన్న, రమణ,ఆర్టీసీ ప్రాంతీయ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు,వడ్డీలు కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్