Eluru: కొత్తూరు జడ్పీ హైస్కూల్‌లో బాల్యవివాహాల వ్యతిరేక సదస్సు

Eluru: ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొత్తూరు జడ్పీ హైస్కూల్‌లో బాల్యవివాహాల వ్యతిరేక అవగాహన సదస్సు; ఆరోగ్య ముప్పులు, మాదకద్రవ్యాలపై న్యాయసేవాధికార కార్యదర్శి హెచ్చరిక.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 27 Nov 2026 7:45 PM IST
Eluru
X

Eluru: కొత్తూరు జడ్పీ హైస్కూల్‌లో బాల్యవివాహాల వ్యతిరేక సదస్సు

ఏలూరు: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు బాల్యవివాహాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలం కొత్తూరు జడ్పీ హైస్కూల్‌లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

యుక్తవయసు వచ్చిన తర్వాతే వివాహాలు చేయాలని,బాల్యవివాహాల వల్ల శారీరక ఎదుగుదల లోపించడంతో పాటు తల్లీబిడ్డల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆమె హెచ్చరించారు. అంతేకాకుండా చదువు మధ్యలోనే ఆగిపోయి భవిష్యత్తు అంధకారమవుతుందని,ప్రతి ఒక్కరూ బాల్యవివాహాలను అరికట్టాలని పిలుపునిచ్చారు.

అలాగే, సంఘవిద్రోహ శక్తులు పిల్లలను లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాల రవాణాకు పాల్పడుతున్నాయని,విద్యార్థులు అపరిచితుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అనంతరం బాల్యవివాహాలకు దూరంగా ఉంటామని,ఎక్కడైనా జరిగితే అధికారులకు సమాచారం అందిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఆంగ్ల ఉపాధ్యాయులు సత్యనారాయణ,పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది మరియు విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid