Eluru: ప్రేమాలయం వృద్ధాశ్రమంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం
Eluru: ఏలూరు ప్రేమాలయం వృద్ధాశ్రమంలో వృద్ధుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి అవగాహన కల్పించి, వైద్య పరీక్షలు చేశారు.
Eluru: ప్రేమాలయం వృద్ధాశ్రమంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం
ఏలూరు: ప్రపంచ వృద్ధులు దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రేమాలయం వృద్ధులు ఆశ్రమం నందు గురువారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి యన్.శ్రీలక్ష్మి అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి యన్.శ్రీలక్ష్మి మాట్లాడుతూ వయోవృద్ధులైన తల్లిదండ్రులు పట్ల పిల్లలు బాధ్యతతో మెలగాలని,వయోభారంతో తల్లిదండ్రులను పిల్లలు భారముగా చూడరాదని అన్నారు.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వటం వల్ల వృద్ధులైన తల్లిదండ్రులు పట్ల పిల్లలు బాధ్యత రహితంగా ఉంటున్నారని, ఇది సమాజానికి చెడుచేస్తుందని సూచించారు.తదనంతరం మెడికల్ క్యాంపు నిర్వహించి వైద్యపరీక్షలు నిర్వహించి మందులను సరఫరా చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రేమాలయం గౌరవ అధ్యక్షులు టి.వి.వెంకటేష్ గురూజీ, ప్రెసిడెంటు టి.వి.సుబ్బారావు,వైస్ ప్రెసిడెంటు ఎం.ఎన్.వి మురళీకృష్ణ, జనరల్ సెక్రెటరీ యన్,రాంబాబు,వృద్ధులు,తదితరులు పాల్గొన్నారు.




