Eluru: ఏలూరులో CEEW శాస్త్రవేత్తల పర్యటన.. ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్‌పై పరిశోధన

Eluru: న్యూఢిల్లీకి చెందిన CEEW శాస్త్రవేత్తలు ఏలూరు జిల్లా వెంకటాపురంలో APCNF ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Oct 2026 11:54 PM IST
Eluru
X

Eluru: ఏలూరులో CEEW శాస్త్రవేత్తల పర్యటన.. ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్‌పై పరిశోధన

Eluru: న్యూఢిల్లీకి చెందిన కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (CEEW) సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు మృదుల్ ఖన్నా మరియు ప్రత్యూష్ భంజా గురువారం ఏలూరు జిల్లా వెంకటాపురం గ్రామాన్ని సందర్శించారు.రైతు సాధికార సంస్థ - ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (APCNF) ద్వారా అమలు చేస్తున్న ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS) పై పరిశోధన ధృవీకరణ కోసం వారు క్షేత్ర పర్యటన నిర్వహించారు.

పర్యటనలో భాగంగా ప్రకృతి వ్యవసాయ పొలాలు మరియు రసాయన వ్యవసాయ పొలాలను సందర్శించిఈ క్రింది అంశాలను పరిశీలించారు.రైతులు PMDS ను నేలలో కలపడం,పశుగ్రాసంగా,గృహ వినియోగానికి,మార్కెట్లో విక్రయించడం వంటి అంశాలను తెలియజేసారు.

దీర్ఘకాలంగా అమలు చేస్తున్న రైతులు,కొత్తగా ప్రారంభించిన రైతులు,PMDS ని నిలిపివేసిన రైతులు,కార్యక్రమంలో ఉన్నా PMDS అమలు చేయని ప్రకృతి వ్యవసాయ రైతులు వివిధ భూ పరిమాణాలు కలిగిన రైతులు మరియు వివిధ స్థాయిలలో ప్రకృతి వ్యవసాయ అనుభవం కలిగిన రైతులు,వ్యవసాయ నిర్ణయాలు మరియు PMDS అమలులో చురుకుగా పాల్గొంటున్న మహిళా రైతులు మరియు SHG సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

APCNF తరపున అడిషనల్ DPM మహబూబ్ వలీ, JPE అంబిక,NFA నవీన మరియు ఇతర APCNF సిబ్బంది,SHG సభ్యులు ఈ క్షేత్ర సందర్శన మరియు చర్చలో పాల్గొన్నారు.ఏలూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ అమలు పట్ల శాస్త్రవేత్తలు సంతృప్తి వ్యక్తం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్