Eluru: 1326 ఓట్ల భారీ మెజార్టీతో నామవరం సర్పంచ్‌గా సూరానేని రజిత!
Eluru: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నామవరం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో సూరానేని రజిత 1,326 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. 12 వార్డులకు 12 వార్డులను కైవసం చేసుకున్నారు.
Eluru: 1326 ఓట్ల భారీ మెజార్టీతో నామవరం సర్పంచ్‌గా సూరానేని రజిత!
ఏలూరు: ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం, నామవరం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో సూరానేని రజిత 1326 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. అంతేకాకుండా గ్రామంలోని 12 వార్డులకు 12 వార్డులూ విజయం సాధించడంతో గ్రామంలో విజయోత్సాహం నెలకొంది.
ఈ సందర్భంగా సర్పంచ్‌గా ఎన్నికైన సూరానేని రజిత మాట్లాడుతూ.. తనపై అపారమైన అభిమానం, నమ్మకం చూపించి భారీ మెజార్టీతో గెలిపించిన నామవరం గ్రామ ప్రజలకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా సూరానేని గోపి మాట్లాడుతూ.. "నామవరం అంటే గోపిబాబు.. గోపిబాబు అంటే నామవరం" అని అన్నారు. రజితకు 1326 ఓట్ల భారీ మెజార్టీతో విజయాన్ని అందించడంతో పాటు, 12 వార్డులకు 12 వార్డులనూ గెలిపించిన నామవరం ప్రజల విజయాన్ని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి అంకితం చేస్తున్నామని తెలిపారు.
ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతగా ఎల్లప్పుడూ ప్రజలకు అంకితమై ఉంటామని, గ్రామ ప్రజలకు సేవ చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని సూరానేని గోపి స్పష్టం చేశారు.




