Eluru: పారా స్విమ్మర్ భవాని కార్తీక్‌కు కలెక్టర్ అభినందనలు!
Eluru: 5వ పారా ఆసియా క్రీడల్లో 3 పతకాలు సాధించి 2028 పారా ఒలింపిక్స్‌కు అర్హత పొందిన పారా స్విమ్మర్ భవాని కార్తీక్‌ను ఏలూరు కలెక్టర్ కె. వెట్రిసెల్వి సత్కరించారు.
Eluru: పారా స్విమ్మర్ భవాని కార్తీక్‌కు కలెక్టర్ అభినందనలు!
ఏలూరు జిల్లా: అంతర్జాతీయ స్థాయిలో జిల్లా ఖ్యాతిని చాటిన పారా స్విమ్మర్ బుడిగిన రవి వీర వెంకట భవాని కార్తీక్‌ను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అభినందించి సత్కరించారు. జపాన్‌లో జరిగిన 5వ పారా ఆసియా క్రీడల్లో భారత్ తరఫున పాల్గొని 100 మీటర్ల ఫ్రీస్టైల్, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రెండు రజత పతకాలు,50 మీటర్ల ఫ్రీస్టైల్‌లో కాంస్య పతకం సాధించడంతో పాటు,2028 లాస్ ఏంజిల్స్ పారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు.
ఇటీవల భోపాల్‌లో జరిగిన సీనియర్ నేషనల్ పారా స్విమ్మింగ్ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించడం అభినందనీయమన్నారు.అనంతరం డిసెంబర్ 3 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 24న అల్లూరి సీతారామరాజు స్టేడియంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్-2026 ఎంపికల పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పారా అసోసియేషన్ సభ్యుడు జాకబ్,జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.ఏ.అజీజ్ పాల్గొన్నారు.




