Eluru: స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు

Eluru: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Oct 2026 10:57 PM IST
Eluru
X

Eluru: స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు

ఏలూరు: ఏలూరు జిల్లాలో జెడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్ రూంలు,కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో జెడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్ రూంలు,కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులతో గురువారం జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్ కేంద్రం ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారులు దగ్గరుండి పరిశీలించాలన్నారు.రిసెప్షన్ కేంద్రాలు,స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటుచేయాలని,వీడియో చిత్రీకరణ చేయించాలన్నారు.

స్ట్రాంగ్ రూమ్ లలో బ్యాలెట్ బాక్సులు భద్రపరిచేందుకు ప్రతీ బ్యాలెట్ బాక్స్ నెంబర్ తో మార్కింగ్ చేయించాలన్నారు.కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల సంఖ్యకు అనుగుణంగా టేబుల్స్ ఏర్పాటు చేయాలనీ,కౌంటింగ్ సిబ్బంది,రాజకీయపక్షాల ప్రతినిధులు ప్రవేశ,నిష్క్రమణ మార్గాలు వేరువేరుగా ఉండేలా చూడాలన్నారుస్ట్రాంగ్ రూమ్ ల వద్ద రెండంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటుచేయాలన్నారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద ఓట్ల కౌంటింగ్ సమయంలో వీడియో చిత్రీకరణతోపాటు,సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ,నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న,అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి,జిల్లా పరిషత్ సీఈఓ ఎం.కృష్ణ మోహన్,ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న,రమణ,ఆర్ఓ లు,ఏఆర్ఓ లు పాల్గొన్నారు.ఎన్ఐసి అధికారులు ఫణికృష్ణ,సుజాత,ప్రభృతులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్