Eluru: ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు పెంపు: కలెక్టర్!
Eluru: గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల్లో ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహక మొత్తాలను పెంచిందని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.
Eluru: ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు పెంపు: కలెక్టర్!
ఏలూరు: ప్రభుత్వం అందించే ప్రోత్సాహక మొత్తాలను పెంచిందని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.2026 గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుందని ఆమె పేర్కొన్నారు.కొత్త ఉత్తర్వుల ప్రకారం... ఐదు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు 15 లక్షల రూపాయలు, ఐదు వేల ఒకటి నుండి పది వేల జనాభా ఉన్న పంచాయతీలకు 25 లక్షల రూపాయలు, పది వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలకు 50 లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందిస్తారు.
సర్పంచ్‌తో పాటు అన్ని వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించిన పంచాయతీలకు మాత్రమే ఈ నిధులు వర్తిస్తాయి. గ్రామ పంచాయతీ పదవీకాలంలో ఈ మొత్తాన్ని దశలవారీగా విడుదల చేస్తారని, ఈ నిధులను కేవలం గ్రామ అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమ పనుల కోసమే వినియోగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.




