Eluru: ఏలూరులో అక్టోబర్ 21 నుండి 23 వరకు నామినేషన్ల స్వీకరణ!

Eluru: ఏలూరు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 Oct 2026 6:11 AM IST
Eluru
X

Eluru: ఏలూరులో అక్టోబర్ 21 నుండి 23 వరకు నామినేషన్ల స్వీకరణ!

Eluru: ఏలూరు జిల్లాలో జెడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా,ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.మంగళవారం సాయంత్రం రిటర్నింగ్,సహాయ రిటర్నింగ్ అధికారులతో ఆమె టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు అని నామినేషన్ల కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి అని కేంద్రానికి 100 మీటర్ల లోపలికి ఎలాంటి వాహనాలను అనుమతించరాదు అని అభ్యర్థితో పాటు ఎన్నికల కమిషన్ సూచించిన వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి అని తెలిపారు.

నామినేషన్ల స్వీకరణ సమయంలో అభ్యర్థి ఓటు వివరాలు,క్రిమినల్ కేసులపై స్వీయ ధ్రువీకరణ,కుల ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి,ఆర్ఓ రూమ్‌లలో తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసి,నామినేషన్ల ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలి అని అన్నారు.నామినేషన్ పత్రాలపై వరుస సంఖ్య,సమయాన్ని నమోదు చేసి, వాటిని స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో పొందుపరచాలి.

ఓటర్ల జాబితాను ఆర్ఓ కార్యాలయ నోటీస్ బోర్డులో ప్రదర్శించాలి. మస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో పటిష్టమైన పోలీసు భద్రత కల్పించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి. ఈ టెలి కాన్ఫరెన్స్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లా పరిషత్ సీఈఓ ఎం.కృష్ణ మోహన్, డిపిఓ మల్లికార్జునరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్