Eluru: రెవెన్యూ సేవల్లో ఏలూరు జిల్లాను ముందుస్థానంలో నిలపాలి: కలెక్టర్!
Eluru: ప్రజలకు రెవెన్యూ సేవలను సమర్థవంతంగా అందించి ఏలూరు జిల్లాను రాష్ట్రంలోనే ముందుస్థానంలో నిలపాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
Eluru: రెవెన్యూ సేవల్లో ఏలూరు జిల్లాను ముందుస్థానంలో నిలపాలి: కలెక్టర్!
ఏలూరు: ప్రజలకు రెవెన్యూ సేవలను సమర్థవంతంగా అందించి జిల్లాను రాష్ట్రంలోనే ముందుస్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.ఏలూరు కలెక్టరేట్‌లో గురువారం జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె.అభిషేక్ గౌడతో కలిసి రీసర్వే,మ్యుటేషన్లు, 22ఏ కేసులు,ఆర్ఓఆర్,పీజీఆర్‌ఎస్ తదితర అంశాలపై డివిజన్ స్థాయి అధికారులు, తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో జూన్ 15 నుంచి ఇప్పటివరకు 568 మంది 22ఏ కేసుల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోగా,232 ఆమోదించామని,243 తిరస్కరించామని తెలిపారు.పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను మర్యాదపూర్వకంగా విని,సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని సూచించారు.ఈ సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి,ఇన్‌చార్జ్ డీఆర్ఓ ఎం.ముక్కంటి,ఆర్డీఓలు,ఇతర అధికారులు పాల్గొన్నారు.




