Eluru: పంచాయతీ ఎన్నికలకు పటిష్ట చర్యలు చేపట్టాం: కలెక్టర్!

Eluru: ఏలూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Nov 2026 8:27 PM IST
Eluru
X

Eluru: పంచాయతీ ఎన్నికలకు పటిష్ట చర్యలు చేపట్టాం: కలెక్టర్!

ఏలూరు: ఏలూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ అనిల్ చంద్ర పునేఠా కు తెలిపారు. రాష్ట్రంలో 23 పట్టణ స్థానిక సంస్థలు మరియు గ్రామ పంచాయతీలకు సంబంధించి, రెండవ సాధారణ ఎన్నికల సన్నద్ధత పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుండి పంచాయతీరాజ, పురపరిపాలన కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లు, ఎన్నికల పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ అనిల్ చంద్ర పునేఠా మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రంలో 23 పట్టణ స్థానిక సంస్థలు మరియు గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియలను నిర్వహించాలన్నారు. అదేవిధంగా ఇటీవల ఎన్నికలు నిర్వహించిన నగరపాలక సంస్థలలో మేయర్,డిప్యూటీ మేయర్, పురపాలక సంఘాలలో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిషత్ చైర్ పర్సన్, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎంపిపి ల ఎంపికలను కూడా నిర్దేశించిన తేదీలలో నిర్వహించాలన్నారు.

ఏలూరు కలెక్టరేట్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. నగరపాలక సంస్థలలో మేయర్,డిప్యూటీ మేయర్, పురపాలక సంఘాలలో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిషత్ చైర్ పర్సన్, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎంపిపి ల ఎంపికలను కూడా నిర్దేశించిన తేదీలలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు,ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న,మండల తహసీల్దార్లు,ఎంపిడిఓ లు, ప్రభృతులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్