Eluru: తుఫాన్ పంట నష్టాలపై తక్షణ నివేదికలివ్వండి కలెక్టర్ వెట్రిసెల్వి

Eluru: అర్నాబ్, మురసు తుఫాన్‌ల పంట నష్టాలపై తక్షణ నివేదికలు ఇవ్వాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశం. వ్యవసాయ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ సమీక్ష.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 Nov 2026 11:38 PM IST
Eluru
X

Eluru: తుఫాన్ పంట నష్టాలపై తక్షణ నివేదికలివ్వండి కలెక్టర్ వెట్రిసెల్వి

ఏలూరు: ఏలూరు జిల్లాలో అర్నాబ్, మురసు తుఫాన్‌ల కారణంగా జరిగిన పంట నష్టాలపై సమగ్ర నివేదికలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.తుఫాన్ నష్టాలపై సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ నుండి వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తుఫాన్‌ల వల్ల జిల్లాలో దెబ్బతిన్న వ్యవసాయ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే నివేదిక ఇవ్వాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ వివరాలను అత్యవసరంగా కోరినందున రైతు పేరు,పంట రకం,విస్తీర్ణం,నష్టం వివరాలను శాస్త్రీయంగా లెక్కించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.నష్టపోయిన ప్రతి రైతు వివరాలు ఆన్‌లైన్‌లో ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు.ఈ సమీక్షలో జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, మండల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్