Eluru: నగర, పురపాలక ఎన్నికల సన్నాహాలపై కలెక్టర్ సమీక్ష!

Eluru: ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం పురపాలక ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్ష. ప్రవర్తనా నియమావళి, ఎన్నికల ఖర్చుల పరిశీలనపై ఆదేశాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 Oct 2026 11:20 PM IST
Eluru
X

Eluru: నగర, పురపాలక ఎన్నికల సన్నాహాలపై కలెక్టర్ సమీక్ష!

ఏలూరు: ఏలూరు జిల్లా వ్యాప్తంగా నగరపాలక సంస్థ పురపాలక సంఘాలలో పోలింగ్,కౌంటింగ్ ప్రక్రియలను పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.ఏలూరు నగరపాలక సంస్థ, నూజివీడు,హెచ్ జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాలలో ఎన్నికల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ శనివారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్,కౌంటింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అభ్యర్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,పోలింగ్, కౌంటింగ్ విధులు కేటాయించిన సిబ్బందికి ప్రక్రియలపై పూర్తిస్థాయిలో శిక్షణ అందించాలన్నారు.

పోలింగ్ మెటీరియల్ ను సిబ్బంది అందించేందుకు,పోలింగ్ స్టేషన్ కు తరలించేందుకు అవసరమైన వాహనాలు,రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకోవాలన్నారు.

పోటీలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల ప్రకారం లెక్కించాలని,మైక్రో అబ్జర్వర్లు అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను లెక్కించాలన్నారు.నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న,ఆర్డీఓలు లక్ష్మి ప్రసన్న, రమణ, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ.భానుప్రతాప్, నూజివీడు మునిసిపల్ కమీషనర్ కె.పీరయ్య,జంగారెడ్డిగూడెం మునిసిపల్ కమీషనర్ కె.వి.రమణ,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్