Eluru: ఏలూరు జిల్లాలో నేడు పరిషత్ ఓట్ల లెక్కింపు

Eluru: ఏలూరు జిల్లాలో 26 జడ్పీటీసీ, 441 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

RAJESH REDDY, CHINTOOR
Updated on: 6 Nov 2026 11:29 PM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లాలో నేడు పరిషత్ ఓట్ల లెక్కింపు

ఏలూరు: జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పకడ్బందీగా,పారదర్శకంగా నిర్వహించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు విధానంపై శుక్రవారం రాత్రి జిల్లా అధికారులతో ఆమె టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 26 జడ్పీటీసీ441 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం (నవంబర్ 7) ఉదయం 8 గంటల నుండి ప్రారంభమవుతుందని తెలిపారు.ఏలూరులోని సర్ సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో,జంగారెడ్డిగూడెంలోని నోవా ఇంజనీరింగ్ కాలేజీలో,నూజివీడులోని సారధి ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

సిబ్బంది ఉదయం 7:30 గంటలకే స్ట్రాంగ్ రూమ్‌ల వద్దకు చేరుకోవాలి అని కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలోనే సీల్స్ ఓపెన్ చేసి,బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు తరలించాలి అని జడ్పీటీసీ,ఎంపీటీసీ ఓట్లను విడివిడిగా ప్రత్యేక టేబుల్స్‌పై లెక్కించాలి అని ఎన్నికల కమిషన్ నిబంధనలను అధికారులు తప్పనిసరిగా పాటించాలి అని తెలిపారు.

ఈ టెలి కాన్ఫరెన్స్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ,నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న,అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి,జిల్లా పరిషత్ సీఈఓ ఎం.కృష్ణమోహన్, ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న,రమణ,తహసీల్దార్లు,ఎంపీడీఓలు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR