Eluru: ఏలూరులో పారిశ్రామికవేత్తల సహాయక కేంద్రం ప్రారంభం
Eluru: ఏలూరు కలెక్టరేట్‌లో పారిశ్రామికవేత్తల సహాయక కేంద్రాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ప్రారంభించారు. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాలా సహకారం.
Eluru: ఏలూరులో పారిశ్రామికవేత్తల సహాయక కేంద్రం ప్రారంభం
ఏలూరు: ఏలూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు కలెక్టరేట్‌లో "పారిశ్రామికవేత్తల సహాయక కేంద్రాన్ని" జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సోమవారం ప్రారంభించారు.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల ఏర్పాటు,అనుమతుల మంజూరుతో పాటు దరఖాస్తు నుండి పరిశ్రమ స్థాపన వరకు ప్రతి దశలోనూ ఈ కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని కలెక్టర్ తెలిపారు.
ఈ కేంద్రంలో నిపుణులైన సిబ్బందిని నియమించామని,పారిశ్రామికవేత్తలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జీఎం వెంకటరావు,APIIC జోనల్ మేనేజర్ బాబ్జి తదితరులు పాల్గొన్నారు.




