Eluru: ఏలూరులో డీఆర్‌సీ సమావేశం ఏర్పాట్లపై కలెక్టర్ కె.వెట్రిసెల్వి సమీక్ష

Eluru: ఏలూరులో బుధవారం జరగనున్న డీఆర్‌సీ సమావేశంపై కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 Sept 2026 11:20 PM IST
Eluru
X

Eluru: ఏలూరులో డీఆర్‌సీ సమావేశం ఏర్పాట్లపై కలెక్టర్ కె.వెట్రిసెల్వి సమీక్ష

ఏలూరు: ఏలూరు జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశమందిరంలో మంగళవారం రేపు(బుధవారం) నిర్వహించబోయే జిల్లా సమీక్షా కమిటీ (DRC) సమావేశం సందర్భంగా వివిధ శాఖలు అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన నిర్వహించారు.

జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ లు పాల్గొన్నారు.అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేసి జిల్లా సమీక్షా కమిటీ సమావేశాన్ని విజయవంతం చెయ్యాలని ఆదేశించారు.ఎజెండాలో నిర్దేశించిన అంశాల పై నివేదికలను వేంటనే అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.గత జిల్లా సమీక్షా కమిటీ యాక్షన్ టేకెన్ రిపోర్టు (ATR) సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రేపు జరగబోవు జిల్లా సమీక్షా కమిటీ ​సమావేశంలో గౌరవ జిల్లా ఇంచార్జి,రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్,రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి,రాజ్యసభ సభ్యులు,పార్లమెంటు సభ్యులు,శాసనమండలి సభ్యులు,శాసనసభ్యులు పాల్గొంటారని అన్నారు.

అభివృద్ధి,సంక్షేమతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత పలు అంశాలుపై విస్తృతంగా సమీక్షించనున్నారని తెలిపారు.ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ శాఖలు ​ప్రకృతి వ్యవసాయం & ఉద్యానవన పంటలు,జిల్లాలో ప్రకృతి సేద్యం విస్తరణ, రైతులకు అందుతున్న ప్రోత్సాహకాలు,ఎదురవుతున్న ఇబ్బందులను,ఉద్యాన పంటలు సాగువిస్తీర్ణంరైతు దిగుబడులు.

పీ-4 కార్యక్రమం పేదరిక నిర్మూలన దిశగా ప్రణాళిక అమలు తీరు,లబ్ధిదారులు ఎంపిక,ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటులో సాధించిన పురోగతి,ధరఖాస్తులు పరిష్కారం, ​రైతు సేవాకేంద్రాలు (RSK) ద్వారా రైతులకు అందుతున్న ఎరువులు,విత్తనాలు పంపిణీ,ఈ-క్రాప్ నమోదు మరియు ఆర్బీకేలు పనితీరు, తదితర కీలక అంశాలుపై సంబంధిత శాఖలు ప్రగతిని జిల్లా ఇన్చార్జి మంత్రి సమీక్షిస్తారని వివరించారు.

ఈ సమావేశంలో మంత్రి లేదా ప్రజా ప్రతినిధులు అడిగే ప్రతి ప్రశ్నకు శాఖలు వారీగా ఖచ్చితమైన గణాంకాలు,నివేదికలతో స్పష్టమైన సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.ఎలాంటి అలసత్వానికి తావులేకుండా, పూర్తి వివరాలతో కూడిన రికార్డులను వెంట తీసుకురావాలని జిల్లా కలెక్టరు స్పష్టం చేశారు.ప్రధానమంత్రి సూర్యఘర్ ప్రగతిపై స్టాల్స్ ఏర్పాటు చెయ్యాలని విద్యుత్తు శాఖ యస్ఇ ఆదేశించారు.

ఇంచార్చ్ మంత్రి దగ్గరలో చూస్తాను అంటే సేంద్రియ వ్యవసాయంతో వ్యవసాయ,ఉద్యానవన శాఖ పంటలు చూసేలా గ్రామాన్ని ఎంపిక చేసుకుని సిద్ధం చేసుకోవాలని అన్నారు.​ఈ సన్నాహక సమావేశంలో ఆర్&బి శాఖ యస్ఇ కె.విజయరత్నం,విద్యుత్తు శాఖ యస్ఇ అంబేద్కర్,సిపివో కె.శ్రీనివాసరావు,ఎపి యంఐపి పిడి యస్.రామ్మోహన్,నగర పాలక సంస్థ కమీషనరు ఏ.భానుప్రతాప్,వివిధ శాఖలు అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్