Eluru: 'అర్నాబ్' తుఫాన్ హెచ్చరికలు – అత్యవసర టెలీకాన్ఫరెన్స్!
Eluru: ఏలూరు జిల్లాలో అర్నాబ్ తుఫాన్ ముప్పు. కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ టెలీకాన్ఫరెన్స్. లోతట్టు ప్రజల తరలింపు, జల్లేరుపై నిఘాకు ఆదేశం.
Eluru: 'అర్నాబ్' తుఫాన్ హెచ్చరికలు – అత్యవసర టెలీకాన్ఫరెన్స్!
ఏలూరు: అర్నబ్' తుఫాన్ ప్రభావంతో ఏలూరు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ అధికారులతో అత్యవసర టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.లోతట్టు ప్రాంతాలు,శిథిల భవనాల్లోని ప్రజలను వెంటనే తుఫాన్ సహాయక కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
పెనుగాలుల ముప్పు ఉన్నందున ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా గ్రామాల్లో మైకుల ద్వారా అప్రమత్తం చేయాలన్నారు.నదులు,చెరువుల వద్ద గండ్లు పడకుండా చూడాలని,జల్లేరు రిజర్వాయర్ గట్ల వెంబడి నిఘా ఉంచాలని సూచించారు.
ప్రమాదకర కల్వర్టులు,కాజ్‌వేల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు.తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం రాష్ట్ర విపత్తు నివారణ దళం (SDRF), పోలీస్ సిబ్బంది పూర్తిగా సిద్ధంగా ఉన్నారని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు.ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.




