Eluru: భారీ వర్షాల హెచ్చరిక అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్

Eluru: ఏలూరు జిల్లాలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ కె.వెట్రిసెల్వి టెలికాన్ఫరెన్స్. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలకు అప్రమత్తత ఆదేశాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 Sept 2026 11:34 PM IST
Eluru
X

Eluru: భారీ వర్షాల హెచ్చరిక అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్

ఏలూరు: ఏలూరు జిల్లాలో వాయుగుండం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను అప్రమత్తం చేశారు.

బుధవారం సాయంత్రం అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె వరద ముందస్తు జాగ్రత్తలపై సమీక్షించారు. భద్రాచలం నుండి గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున,పరివాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేయాలని ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.ఎటువంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని,బాధితుల సహాయార్థం మండల,డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్