Eluru: ఏలూరు జిల్లాలో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు: కలెక్టర్!
Eluru: ఏలూరు జిల్లాలో 544 గ్రామ పంచాయతీలకు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 3 వరకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి షెడ్యూల్ వెల్లడించారు.
Eluru: ఏలూరు జిల్లాలో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు: కలెక్టర్!
ఏలూరు: ఏలూరు జిల్లాలోని 544 గ్రామ పంచాయతీలకు నవంబర్,15వ తేదీ నుండి డిసెంబర్ 3వ తేదీ వరకు మూడు దశలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి స్పష్టం చేశారు. జిల్లాలోని 27 మండలాల్లోని 544 గ్రామ పంచాయతీలలలోని 5696 వార్డ్ మెంబర్లకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని,5821 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుచేయడం జరిగిందన్నారు.
మొదటి దశలో ఎన్నికలు నిర్వహించనున్న బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కామవరపుకోట,కొయ్యలగూడెం,కుక్కునూరు, పోలవరం,టి. నర్సాపురం, వేలేరుపాడు, చింతలపూడి, లింగపాలెం మండలాలకు చెందిన 177 గ్రామ పంచాయతీలలో 1896 వార్డ్ మెంబర్లకు సంబంధించి 1953 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుచేయడం జరిగిందని, వీటికి రిటర్నింగ్ అధికారి ద్వారా నామినేషన్లు నిమిత్తం నవంబర్, 15వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, 17వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు.
18వ తేదీన నామినేషన్లు పరిశీలించడం జరుగుతుందన్నారు. తిరస్కరించిన నామినేషన్లపై 19వ తేదీన అప్పీలు చేసుకోవచ్చని,20వ తేదీలోగా అప్పీళ్లను పరిష్కరించడం జరుగుతుందన్నారు. 21వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని, అదే రోజు తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందన్నారు. నవంబర్,26వ తేదీన ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, అదేరోజు ఫలితాలు వెల్లడించడం జరుగుతుందన్నారు.అవసరమైన పక్షంలో 27వ తేదీన రీపోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
రెండవ దశలో ఎన్నికలు నిర్వహించనున్న భీమడోలు, కైకలూరు, కలిదిండి,మండవల్లి, ముదినేపల్లి, నిడమర్రు,ఉంగుటూరు, ద్వారకాతిరుమల మండలాలకు చెందిన 194 గ్రామ పంచాయతీలలో 1972 వార్డ్ మెంబర్లకు సంబంధించి 2024 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుచేయడం జరిగిందని,వీటికి రిటర్నింగ్ అధికారి ద్వారా నామినేషన్లు నిమిత్తం నవంబర్,18వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు.
21వ తేదీన నామినేషన్లు పరిశీలించడం జరుగుతుందన్నారు. తిరస్కరించిన నామినేషన్లపై 22వ తేదీన అప్పీలు చేసుకోవచ్చని, 23వ తేదీలోగా అప్పీళ్లను పరిష్కరించడం జరుగుతుందన్నారు. 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని, అదే రోజు తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందన్నారు. నవంబర్,29వ తేదీన ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, అదేరోజు ఫలితాలు వెల్లడించడం జరుగుతుందన్నారు. అవసరమైన పక్షంలో 30వ తేదీన రీపోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
మూడవ దశలో ఎన్నికలు నిర్వహించనున్న దెందులూరు,ఏలూరు, పెదపాడు,పెదవేగి,అగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు,నూజివీడు మండలాలకు చెందిన 173 గ్రామ పంచాయతీలలో 1828 వార్డ్ మెంబర్లకు సంబంధించి 1844 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుచేయడం జరిగిందని, వీటికి రిటర్నింగ్ అధికారి ద్వారా నామినేషన్లు నిమిత్తం నవంబర్, 21వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు.
24వ తేదీన నామినేషన్లు పరిశీలించడం జరుగుతుందన్నారు.తిరస్కరించిన నామినేషన్లపై 25వ తేదీన అప్పీలు చేసుకోవచ్చని,26వ తేదీలోగా అప్పీళ్లను పరిష్కరించడం జరుగుతుందన్నారు.27వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని,అదే రోజు తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందన్నారు.డిసెంబర్,2వ తేదీన ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని,అదేరోజు ఫలితాలు వెల్లడించడం జరుగుతుందన్నారు.అవసరమైన పక్షంలో డిసెంబర్,3వ తేదీన రీపోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
జిల్లాలో ఇప్పటికే నగరపాలక సంస్థ, పురపాలక సంఘాలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకున్నామని, గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి అన్ని అంశాలలో శిక్షణ అందించడం జరుగుతున్నదన్నారు. నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు వీడియోలు చిత్రీకరించడం జరుగుతుందని, అంతేకాక సిసి కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయన్నారు. ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన ప్రాంతాల్లో అదనపు భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు.




