Eluru: అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు - కలెక్టర్ వెట్రిసెల్వి

Eluru: ఏలూరు కలెక్టరేట్‌లో మీ కోసం (PGRS) కార్యక్రమం నిర్వహించిన కలెక్టర్ వెట్రిసెల్వి 339 అర్జీలు స్వీకరించి, బాధ్యతాయుతంగా పరిష్కరించాలని ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 Sept 2026 6:48 PM IST
Eluru
X

Eluru: అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు - కలెక్టర్ వెట్రిసెల్వి

ఏలూరు: ఏలూరు జిల్లా కలెక్టరేటు గోదావరీ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థ ( మీ కోసం) కార్యక్రమానికి జిల్లా స్థాయీ అధికారులతో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన నిర్వహించారు.జిల్లా కలెక్టరుతో పాటు వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొని ప్రజలు నుండి అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈరోజు పి ఆర్ జి ఎస్ లో 339 అర్జీలు వచ్చాయని ధరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధేశించిన సమయంలోగా శాశ్వత పరిష్కారం సంబంధిత అధికారులు చూపుతారని అన్నారు.పిజిఆర్ఎస్ (మీ కోసం), రెవిన్యూ క్లినిక్ లు నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి,మార్గదర్శకాలను తప్పక పాటించాలన్నారు.

ప్రతి అర్జీని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంటు ఇవ్వాలని,పరిష్కారంలో నిర్లక్ష్యం అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఒకసారి వచ్చిన ఫిర్యాదు మరలా రాకుండా అధికారులు అత్యంత బాధ్యతతో చక్కని పరిష్కారం చూపాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు అధికారులు,తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story