Eluru: ఏలూరులో పునరావాస కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ వెట్రిసెల్వి

Eluru: ఉరసు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో పునరావాస కేంద్రాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించిన కలెక్టర్ వెట్రిసెల్వి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Nov 2026 11:07 PM IST
Eluru
X

Eluru: ఏలూరులో పునరావాస కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ వెట్రిసెల్వి

ఏలూరు: ఉరసు తుఫాన్ కారణంగా ఏలూరు జిల్లాలో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.ఉంగుటూరు మండలం నారాయణపురంలోని కమ్యూనిటీ హాలులో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం సందర్శించి,తుఫాన్ బాధితులను పరామర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ తుఫాన్ కారణంగా జిల్లాలో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.వర్షాల కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చి పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతుందన్నారు.వరద ప్రమాదం పూర్తి ఐన తరవాత తిరిగి వారి ఇళ్లకు పంపించడం జరుగుతుందన్నారు.

పునరావాస కేంద్రాలలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని,నాణ్యమైన భోజనం అందించాలన్నారు.కేంద్రం పరిధిలో పూర్తిగా పారిశుద్ధ్య పరిస్థితిలు ఉండేలా చూడాలని,వైద్య శిబిరం ఏర్పాటుచేయాలన్నారు.

పునరావాస శిబిరంలో ప్రజలను సౌకర్యాలు గురించి,భోజన నాణ్యత, వసతి గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల ప్రత్యేక అధికారి రామ్మోహన్,తహసీల్దార్ సన్యాసిరావు,ఎంపిడిఓ రాజ్ మనోజ్,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్