Eluru: పంచాయతీ ఎన్నికలను విజయవంతం చేయాలి: కలెక్టర్ వెట్రిసెల్వి!

Eluru: ఏలూరు జిల్లా పరిషత్ హాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ అభిషేక్ గౌడ రిటర్నింగ్ అధికారులతో సమగ్ర శిక్షణా సమీక్ష నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 Nov 2026 8:00 PM IST
Eluru
X

Eluru: పంచాయతీ ఎన్నికలను విజయవంతం చేయాలి: కలెక్టర్ వెట్రిసెల్వి!

ఏలూరు: ఏలూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో ప్రకృతి వైపరీత్యాలు ఉన్నప్పటికీ పురపాలక, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన స్పూర్తితోనే, రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా చిత్తశుద్ధితో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

ఏలూరు జిల్లా పరిషత్ సమావేశపు హాలులో మంగళవారం ఆర్ఓలు, ఎన్నికల సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. త్వరలో తుఫాన్ వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలు సురక్షితంగా, అనువుగా ఉండేలా చూసుకోవాలని, అవసరమైతే మార్పుల కోసం తక్షణమే ప్రతిపాదనలు సమర్పించాలని స్పష్టం చేశారు.

అన్ని పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలలో విద్యుత్, తాగునీరు వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండేలా నిష్పక్షపాతంగా ఎన్నికల నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి నాణ్యమైన భోజనం, వసతి కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. గతంలో వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నామని, ఇలాంటివి పునరావృతమైతే అధికారులపై చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంల నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, జెడ్పీ సీఈఓ ఎం.కృష్ణ మోహన్,డీపీఓ మల్లికార్జునరావు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్