Eluru: ఏలూరు జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష!
Eluru: ఏలూరు జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సమీక్ష. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ.
Eluru: ఏలూరు జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష!
Eluru: ఏలూరు జిల్లాలో నగరపాలక సంస్థ,పురపాలక సంఘాలు, జెడ్పీటీసీ,ఎంపీటీసీ పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ నుండి జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి అధికారులతో ఆమె జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలని,ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూడాలన్నారుపోలింగ్ మెటీరియల్ పంపిణీ,వాహనాల రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని,భారీ వాహనాలకు అనుకూలంగా ఉండేలా రూట్ అధికారులు పరిశీలించాలని అన్నారు.బ్యాలెట్ బాక్సుల స్థితిని ముందుగానే తనిఖీ చేయాలని,పోలింగ్ ప్రారంభానికి ముందు ఏజెంట్లకు ఖాళీ బాక్సులను చూపించాలన్నారు.ఓటర్లు ఎక్కువసేపు వేచి ఉండకుండా వేగంగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని,అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియకు పూర్తిస్థాయి భద్రత కల్పించామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని,100 మీటర్ల పరిధిలోకి అనధికార వ్యక్తులకు ప్రవేశం లేదని స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్లకు నష్టం కలిగించే నీరు,ఇంకు వంటివి కేంద్రాల్లో ఉంచకూడదని,ప్రజలు గుమిగూడకుండా క్యూ లైన్లను క్రమబద్ధీకరించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ,అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ బి.వినూత్న,ఆర్డీఓలు లక్ష్మి ప్రసన్న,రమణ, పంచాయతీరాజ్ ఎస్ఈ జెడ్. లరమేష్ మరియు రిటర్నింగ్ అధికారులు,తహసీల్దార్లు పాల్గొన్నారు.




