Eluru: ఏలూరు జిల్లా జీడీడీపీ వృద్ధిపై కలెక్టర్ సమీక్ష

Eluru: అమరావతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో ఏలూరు జిల్లా జీడీడీపీ వృద్ధి అవకాశాలను కన్సల్టెంట్స్ బృందానికి కలెక్టర్ కె.వెట్రిసెల్వి వివరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Oct 2026 9:39 PM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లా జీడీడీపీ వృద్ధిపై కలెక్టర్ సమీక్ష

ఏలూరు: ఏలూరు జిల్లాలో అమరావతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో జిడిడిపి వృద్ధికి గల అవకాశాలను అమరావతి ఎకనామిక్ రీజియన్ కన్సల్టెంట్స్ బృందం సభ్యులకు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి వివరించారు.

ఏలూరు కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం అమరావతి ఎకనామిక్ రీజియన్ కన్సల్టెంట్స్ బృందం సభ్యులతో అధికారులతో కలిసి జిల్లాలో జిడిడిపి వృద్ధికి సంబందించిన అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ బృందం సభ్యులతో చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ,అనుబంధ రంగాలు, ఆక్వా,పర్యాటకాభివృద్ధి ద్వారా జిల్లా జిడిపి వృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు.వ్యవసాయ,అనుబంధ రంగాలలో మరింత అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు,రైతులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు,ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు,తదితర అంశాలను చర్చించారు.

జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని,వాటిలో నియోజకవర్గాల వారీగా జిడిడిపి వృద్ధిని ప్రభావితం చేసే అంశాలపై ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు.ఏలూరు జిల్లా దేశానికే ధాన్యాగారమని వాటితో పాటు ప్రధానంగా ఉద్యానవన శాఖలలో ఆయిల్ పామ్,కోకో,కొబ్బరి తో పాటు మత్స్య శాఖలో ఆక్వా పరిశ్రమ ద్వారా వృద్ధి రేటు పెరుగుదలకు అవకాశాలున్నాయన్నారు.

పర్యాటకరంగంలో పాపికొండలు,కొల్లేరు, గిరిజన ప్రాంతాలలో పర్యాటక ప్రదేశాలు, పోలవరం ప్రాజెక్ట్, టెంపుల్ టూరిజం లో ద్వారకా తిరుమల,పట్టిసీమ,వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలున్నాయని,వాటిల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి ద్వారా జిడిడిపి పెంచవచ్చన్నారు.పారిశ్రామికరంగంలో ఏలూరు జిల్లా ప్రధానంగా వ్యవసాయక జిల్లా అని,స్థానిక వనరుల వినియోగంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపనతో జిడిడిపి పెంచవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ,అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి,జిల్లా ప్రణాళికాధికారి శ్రీనివాస్,జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ వెంకటరావు,జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా,పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ జోనల్ మేనేజర్ బాబ్జి, ఇరిగేషన్,పంచాయతీరాజ్ ఎస్ఈ లు గుణకనకరావు, జెడ్ రమేష్,మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధికారి రామ్మోహన్,పర్యాటకాధికారి పట్టాభి రామయ్య,అమరావతి ఎకనామిక్ రీజియన్ కన్సల్టెంట్స్ బృందం సభ్యులు,ప్రభృతులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్