Eluru: ఏలూరు జిల్లా పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్ష
Eluru: ఏలూరు జిల్లాలో 164 సర్పంచ్, 1,567 వార్డు స్థానాలకు రేపు పోలింగ్; 13 సర్పంచ్, 324 వార్డులు ఏకగ్రీవమని వెల్లడించిన కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
Eluru: ఏలూరు జిల్లా పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్ష
ఏలూరు: ఏలూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా,నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పోలింగ్ సిబ్బందిని ఆదేశించారు.బుధవారం చింతలపూడి ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల సామాగ్రి పంపిణీని కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 11 మండలాల్లో ఉన్న 177 గ్రామ పంచాయతీలకు గాను,ఇప్పటికే 13 సర్పంచ్, 324 వార్డు మెంబర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు.
మిగిలిన 164 సర్పంచ్,1,567 వార్డు మెంబర్ స్థానాలకు ఈనెల 26న పోలింగ్ జరగనుంది.ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్,మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని, అదే రోజు ఫలితాలు ప్రకటించి ఉప సర్పంచ్ ఎన్నిక కూడా పూర్తి చేస్తామని తెలిపారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతతో పాటు,పోలింగ్ మరియు కౌంటింగ్ కేంద్రాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




