Eluru: ఏలూరులో రోడ్డు భద్రత సమీక్ష.. రహ్-వీర్‌పై కలెక్టర్ వివరణ
Eluru: ఏలూరు జిల్లా రహదారి భద్రత కమిటీ సమీక్షలో కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఆదేశాలు; రహ్-వీర్ కింద రూ.25 వేల బహుమతి, విద్యార్థుల భద్రత.
Eluru: ఏలూరులో రోడ్డు భద్రత సమీక్ష.. రహ్-వీర్‌పై కలెక్టర్ వివరణ
ఏలూరు: ఏలూరు జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ల వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్‌తో కలిసి జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆమె సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అతివేగం, హెల్మెట్,సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాలు,మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు.కళాశాలల్లో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి 'రహ్-వీర్' పథకం కింద రూ.25 వేల నగదు బహుమతి,ప్రశంసా పత్రం అందిస్తామని తెలిపారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలించకుండా చర్యలు తీసుకోవాలని,తల్లిదండ్రులు పిల్లలకు సురక్షిత రవాణా సౌకర్యాలు కల్పించాలని సూచించారు.మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు కూడా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




