Eluru: 13 పరిశ్రమలకు రూ.4.95 కోట్ల రాయితీలు మంజూరు
Eluru: ఏలూరు జిల్లాలో 13 పరిశ్రమలకు రూ.4.95 కోట్ల రాయితీలను మంజూరు చేసినట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. సింగిల్ విండో ద్వారా అనుమతులు.
Eluru: 13 పరిశ్రమలకు రూ.4.95 కోట్ల రాయితీలు మంజూరు
ఏలూరు: ఏలూరు జిలాల్లో 13 పరిశ్రమలకు వివిధ రాయితీలకింద 4.95 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.ఏలూరు కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో గురువారం జరిగిన జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన అనుమతులను సింగిల్ విండో పధకం ద్వారా నిర్దేశించిన సమయంలోనే వివిధ శాఖల ద్వారా అందిస్తున్నామన్నారు.
గత నెల రోజులలో జిల్లాలో 55 అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు.జిల్లాలో పలు పరిశ్రమలకు పెట్టుబడి రాయితీ, వడ్డీ, విద్యుత్,రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ,తదితర రాయితీలుగా 4 కోట్ల 95 లక్షల మంజూరు చేస్తూ సమావేశం తీర్మానించింది.
ఎంఎస్ఎంఈ లకు పరిశ్రమల ఏర్పాటులో జిల్లా యంత్రాంగం సింగల్ విండో పధకం కింద నిర్దేశించిన సమయంలోనే అనుమతులు మంజూరు చేస్తూ,యూనిట్ల స్థాపనలో వారికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తున్నదన్నారు.జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు రెండవవిడతగా 192 లక్ష్యానికిగాను,ఇప్పటివరకు 72 యూనిట్లను గుర్తించడం జరిగిందని,వాటిలో 53 మంజూరు కాగా,వివిధ బ్యాంకుల్లో 20 పెండింగులో ఉన్నాయన్నారు.
అక్టోబర్, 15వ తేదీ నాటికి బ్యాంకుల్లో ఉన్న ధరఖాస్తులు మంజూరు చేయించి పనులు మొదలు పెట్టించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమలు కేంద్ర జియం ఆర్.వెంకటరావు,ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రాములు నాయక్,జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా,పొల్యూషన్ కంట్రోల్ ఇఇ ఏ.శ్రీరామచంద్ర మూర్తి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జెడి వై.విశ్వమోహన్ రెడ్డి, డ్వామా పిడి కె.వెంకట సుబ్బారావు,డిఆర్డిఏ పిడి టి.వి.విజయ లక్ష్మి,జిల్లా స్కిల్ డెవలప్మెంటు అధికారి యన్.జితేంద్ర బాబు,ఎల్డిఎమ్ సత్యనారాయణ,పంచాయతీ రాజ్ ఎస్ఈ జెడ్.రమేష్, జిల్లా గ్రౌండు వాటరు డిడి పైలా కోదండరామ్,మెప్మా పిడి రాజబాబు,పలువురు పారిశ్రామికవేత్తలు సంబంధిత శాఖలు అధికారులు,తదితరులు పాల్గొన్నారు.




