Eluru: బ్యాలెట్ బాక్సులకు పటిష్ట పహారా: కలెక్టర్ వెట్రిసెల్వి!
Eluru: ఏలూరు జిల్లాలోని 23 మండలాల్లో పోలింగ్ ముగియడంతో సర్ సీఆర్ రెడ్డి కళాశాలల్లోని స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతను కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ పరిశీలించారు.
Eluru: బ్యాలెట్ బాక్సులకు పటిష్ట పహారా: కలెక్టర్ వెట్రిసెల్వి!
ఏలూరు: ఏలూరు జిల్లాలోని 23 మండలాల్లో గురువారం జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది.పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను స్థానిక సర్ సి.ఆర్.ఆర్.పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలల్లోని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు.
ఈ భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి,జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ కలిసి గురువారం రాత్రి దగ్గరుండి పరిశీలించారు.కౌంటింగ్ ముగిసే వరకు బ్యాలెట్ బాక్సులకు రెండంచెల అత్యంత పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈనెల 7వ తేదీన (శనివారం) పోలింగ్ సిబ్బంది,పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. బ్యాలెట్ బాక్సులను చేర్చడంలో పోలింగ్ సిబ్బందికి కలెక్టర్ స్వయంగా సహాయం చేయడంతో పాటు,వారికి ఏర్పాటు చేసిన భోజన సౌకర్యాలను,నాణ్యతను కూడా తనిఖీ చేశారు. ఈ పరిశీలనలో జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ,అసిస్టెంట్ కలెక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి,జెడ్పీ సీఈఓ కృష్ణమోహన్,ఆర్డీఓ లక్ష్మీప్రసన్న మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




