Eluru: ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం యథావిధిగా పీజీఆర్‌ఎస్!

Eluru: ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సెప్టెంబర్ 28న పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్: ఇన్‌చార్జ్ డీఆర్వో ఎం.ముక్కంటి వివరాల వెల్లడి, టోల్ ఫ్రీ 1100 సదుపాయం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 Sept 2026 11:06 PM IST
Eluru
X

Eluru: ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం యథావిధిగా పీజీఆర్‌ఎస్!

ఏలూరు: ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశం మందిరంలో ఈనెల,28వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా స్థాయిలో యధావిధిగా పిజిఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం.ముక్కంటి తెలిపారు. ఫిర్యాదు నమోదు,ఫిర్యాదుల స్థితి తదితర సమాచారం తెలుసుకోవాలంటే 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు.

అర్జీదారులు తమ ఫిర్యాదులను అధికారిక వెబ్‌సైట్ meekosam.ap.gov.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. పిజిఆర్ఎస్‌కు హాజరయ్యే ప్రజల కోసం తాగునీరు,భోజనం వంటి సౌకర్యాలతో పాటు వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబడినట్లు తెలిపారు.అందిన అర్జీలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి,సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఇంచార్జ్ డిఆర్ఓ స్పష్టం చేశారు.

(PGRS) సేవలను సెప్టెంబర్,28వ తేదీ సోమవారం మండల,డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిల్లో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులను సమీప మండల కార్యాలయాల్లో, డివిజనల్ కార్యాలయాల్లో, లేదా మున్సిపల్ కార్యాలయాల్లో నేరుగా సమర్పించుకోవచ్చన్నారు. అలాగే,ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు, ప్రభుత్వం అందించిన అధికారిక వెబ్‌సైట్:

🔗 https://meekosam.ap.gov.in

ఈ వ్యవస్థ వల్ల ప్రజల సమస్యలు తక్షణమే సంబంధిత అధికారులకు చేరి, సమయానుకూలంగా పరిష్కారమవుతాయన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్