Eluru: రేపే ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం పురపాలక కౌంటింగ్
Eluru: ఏలూరు నగరపాలక సంస్థ, నూజివీడు, జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం. సిఆర్ రెడ్డి కాలేజీలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ వెట్రిసెల్వి.
Eluru: రేపే ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం పురపాలక కౌంటింగ్
ఏలూరు: ఏలూరు నగరపాలక సంస్థ,నూజివీడు,జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాలకు ఈనెల 1వ తేదీన పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఈనెల 3వ తేదీ ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏలూరులోని సర్.సి.ఆర్. రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో,నూజివీడు పురపాలక సంఘానికి సంబంధించి నూజివీడులో సారధి ఇంజనీరింగ్ కళాశాలలో,జంగారెడ్డిగూడెం పురపాలక సంఘానికి సంబంధించి వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద నవంబర్ 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది.
కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది ఉదయం 6 గంటలకే సంబంధిత కేంద్రాలకు చేరుకుని విధుల్లో పాల్గొంటారు.ముందుగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు తీసుకువచ్చి,ఎన్నికల నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు.ఏలూరు నగరపాలక సంస్థకు సంబంధించి సర్.సి.ఆర్. రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఓట్ల లెక్కింపు కేంద్రంలో కౌంటింగ్ ప్రక్రియ వేగవంతంగా నిర్వహించేందుకు రెండు కౌంటింగ్ హాల్స్ ను ఏర్పాటు చేశారు.
డివిజన్ కార్పొరేటర్లకు, మేయర్ ఓట్లను వేరువేరుగా లెక్కిస్తారు.సోమవారం సాయంత్రం సర్.సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులతో కలిసి పరిశీలించారు..ప్రతీ టేబుల్ పై కౌంటింగ్ నకు అవసరమైన పరికరాలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు.కౌంటింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేందుకు మరిన్ని సిసి కెమెరాలు ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు.
ఫలితాలను తెలియజేసే డిస్ప్లే బోర్డులను పరిశీలించారు.భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా అందుకు తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు.పోలింగ్ సిబ్బందికి అవసరమైన స్నాక్స్ అందించేలా చూడాలన్నారు. సిబ్బందికి ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారుకలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ఎం.జె.అభిషేక్ గౌడ,అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి,ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న,ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ.భానుప్రతాప్,డిఎస్పీ శ్రావణ్ కుమార్,నగరపాలక సంస్థ సిబ్బంది,ప్రభృతులు పాల్గొన్నారు.




