Eluru: పోలవరం మండలం లో తుఫాన్‌ దెబ్బకు 9 వేల ఎకరాల్లో పంట నష్టం!

Eluru: ఏలూరు జిల్లా పోలవరం మండలంలో తుఫాన్ దెబ్బకు 9 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు. 10 గ్రామాల్లో 5,636 మంది రైతులు నష్టం. వ్యవసాయశాఖ ప్రాథమిక నివేదిక వెల్లడి.

V RANJITH KUMAR, POLAVARAM
Published on: 11 Nov 2026 8:14 AM IST
Eluru
X

Eluru: పోలవరం మండలంలో తుఫాన్ ప్రభావంతో 9 వేల ఎకరాల్లో పంట నష్టం!

Eluru: ఏలూరు జిల్లా పోలవరం లో తుఫాన్‌ ప్రభావంతో పోలవరం మండలంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని పది గ్రామాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. మొత్తం 5,636 మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు.

వరి పంట 7,200 ఎకరాల్లో దెబ్బతినగా 4,697 మంది రైతులు నష్టపోయారు. మినుము 1,600 ఎకరాల్లో దెబ్బతినడంతో 837 మంది రైతులపై ప్రభావం పడింది. పత్తి 195 ఎకరాల్లో నష్టపోగా 96 మంది రైతులు, పొగాకు 10 హెక్టార్లలో దెబ్బతినడంతో ఆరుగురు రైతులు నష్టపోయారు. వరి పంట బూటింగ్‌ దశ నుంచి గింజ గట్టిపడే దశలో ఉండగా, మినుము కోతకు సిద్ధంగా ఉంది. పత్తి రెండో విడత ఏరే దశలో, పొగాకు నారుమడి దశలో ఉంది. ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారులు నవంబరు 5న ప్రాథమిక పంట నష్టం నివేదికను ధ్రువీకరించారు.

V RANJITH KUMAR, POLAVARAM

V RANJITH KUMAR, POLAVARAM