Eluru: ఏలూరు జిల్లాలో 7,816 పట్టాదార్ పాస్ పుస్తకాల లక్ష్యం.. 2,233 పంపిణీ పూర్తి

Eluru: ఏలూరు జిల్లాలో నవంబర్ లక్ష్యంలో 2,233 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు సీసీఎల్ఏ జి. జయలక్ష్మికి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వివరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Nov 2026 6:01 PM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లాలో 7,816 పట్టాదార్ పాస్ పుస్తకాల లక్ష్యం.. 2,233 పంపిణీ పూర్తి

ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లాలో నవంబర్ నెలలో 7 వేల 816 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ లక్ష్యానికి గాను,2 వేల 233 పుస్తకాలు పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి.జయలక్ష్మి కి తెలిపారు.

పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ,రీ సర్వే, మ్యూటేషన్స్ ఈ-కెవైసి, పబ్లిక్ పాజిటివ్ పెర్సెప్షన్ తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి బుధవారం రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి.జయలక్ష్మి రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా సిసిఎల్ఏ జయలక్ష్మి మాట్లాడుతూ నవంబర్ నెలలో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీని నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలని,డిసెంబర్ నెలకు గాను పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలని,మ్యూటేషన్స్ ఈ-కెవైసి పనులు నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు.రీ సర్వే పనులను నిర్దేశించిన లక్ష్యాల మేర పూర్తిచేయాలన్నారు.

ప్రభుత్వ సేవల మరింత మెరుగైన రీతిలో ప్రజలకు అందించి ప్రజల సంతృప్తి స్థాయిని మరింత పెంచాలన్నారు.ఏలూరు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ నవంబర్ నెలలో జిల్లాలోని 18 గ్రామాలలో 7 వేల 816 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ లక్ష్యానికి గాను, 2 వేల 233 పుస్తకాలు పంపిణీ చేశామన్నారు.

డిసెంబర్ నెలలో 56 గ్రామాలలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి గాను ఇంతవరకు 7975 పుస్తకాలు ముద్రణకు సిద్ధం చేశామని,మిగిలినవి ఈనెల 17వ తేదీలోగా ముద్రణకు చర్యలు తీసుకుంటామన్నారు.మ్యూటేషన్స్ ఈ-కెవైసి 12 వేల 414 లక్ష్యానికిగాను,8384 పూర్తిచేశామని, మిగిలినవి నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ,నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న,ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న,రమణ, ప్రభృతులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్