Eluru: గోదావరి నదిలో స్నానానికి దిగి యువకుడు గల్లంతు!

Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని రుద్రంకోట గోదావరి రేవులో ఘోర ప్రమాదం జరిగింది.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 14 Jun 2026 3:39 PM IST
Eluru
X

Eluru: గోదావరి నదిలో స్నానానికి దిగి యువకుడు గల్లంతు!

Eluru: గోదావరి నదిలో స్నానానికి దిగి యువకుడుగల్లంతయిన సంఘటన వేలేరుపాడు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల పరిధిలోని రుద్రం కోట గ్రామానికి చెందిన కంతి రెడ్డి రాంబాబు (25) గోదావరిలో గల్లంతయ్యాడు. రుద్రంకోట గొదావరీ రేవులో స్నానం చేయడానికి దిగి ప్రమాదవశాత్తు కాలు జారి గోదావరి నీటిలో పడి గల్లంతయ్యాడు.

స్థానికులు వేలేరుపాడు పోలీసులకు సమాచారం అందించడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని,గ్రామస్తుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.గల్లంతైన యువకుడి కోసం ఆచూకీ తెలియకపోవడంతో పోలీస్, రెవిన్యూ అధికారులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గోదావరి నది ఒడ్డున కుటుంబ సభ్యులు, కన్నీరు మునీరుగా వినిపిస్తున్నారు.

ఈ ఘటనతో రుద్రంకోట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story